Mangaluru Blast : మంగళూరు పేలుడులో షరీఖ్ కీలకం
గత నెలలోనే ఓ గదిని అద్దెకు తీసుకున్నారు
Mangaluru Blast : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది కర్ణాటక లోని మంగళూరులో ఆటో పేలుడు(Mangaluru Blast) ఘటన. డ్రైవర్ తో పాటు మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనను తాము తేలికగా తీసుకోవడం లేదన్నారు. ఘటన వెనుక ఉగ్ర చర్య దాగి ఉందని వెల్లడంచారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన వెంటనే రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలోనే తేలుస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గాలింపు చర్యలు చేపట్టాయని చెప్పారు.
అంతలోనే కీలక సమాచారం కనుగొన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనేది తేలింది. ఇందులో భాగంగా మంగళూరు ఆటో పేలుడు ఘటనలో కీలక నిందితుడిగా షరీఖ్ గా గుర్తించారు. అతడు ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్ పోలీసులు గాలిస్తున్నారు.
షరీఖ్ తో పాటు మరికొందరు దీని వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులు గత నెలలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో ఆటో రిక్షాలో బ్యాటరీలతో కాలి పోయిన ప్రెషర్ కుక్కర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా కూంబింగ్ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతంలో మోహరించినట్లు వెల్లడించారు.
మొబైల్ రిపేర్ ట్రైనింగ్ కోసం తాను నగరంలో ఉన్నానని ఇంటి యజమానికి తెలిపాడని చెప్పారన్నారు. కోయంబత్తూరు నుంచి తప్పుడు పేరుతో షరీఖ్ సిమ్ కార్డును సంపాదించాడని పేర్కొన్నారు. ఘటన జరిగే కంటే ముందు తమిళనాడులో సంచరించాడని చెప్పారు.
Also Read : మంగళూరు పేలుడు వెనుక ఉగ్ర చర్య