Manipur CM : మణిపూర్ జాతుల మధ్య హింసకు సీఎం ఆదేశించారంటూ ఆడియో వైరల్

కోర్టు అనుమతితో ప్రశాంత్‌ భూషణ్‌ ట్రూత్‌ ల్యాబ్స్‌ను సంప్రదించగా....

Manipur CM : మణిపూర్‌లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌ సింగ్‌(Biren Singh) ప్రేరేపించారంటూ లీకైన ఆడియో క్లిప్‌పై హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్‌ ల్యాబ్స్‌ ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదిక సంచలనం రేపుతోంది. ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయీలకు అవకాశమివ్వండి’’ అంటూ ఆదేశించే ఆడియో క్లిప్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే..! ఈ క్లిప్‌లోని ఆడియోతో.. సీఎం బీరేన్‌ సింగ్‌(Biren Singh) గొంతు 93% వరకు మ్యాచ్‌ అవుతోందని ట్రూత్‌ ల్యాబ్స్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. కేంద్రం, మణిపూర్‌ సర్కారు తరఫున వాదనలను వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(సీఎ్‌ఫఎ్‌సఎల్‌) పరిశీలన జరగాలని, మూడు వారాల గడువు కావాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.

Manipur CM Audio Viral

సీల్డ్‌ కవర్‌లో సమగ్ర నివేదికను అందజేయాలని సీఎ్‌ఫఎ్‌సఎల్‌ను ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. గత ఏడాది మే 3 నుంచి మణిపూర్‌(Manipur)లోని మైదాన ప్రాంతాలకు చెందిన మైతేయీలు, కొండ ప్రాంతాలకు చెందిన కుకీలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మంది మృతిచెందిన విషయం తెలిసిందే..! ఈ హింసతో 70 వేల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. జాతుల మధ్య వైరానికి సీఎం బీరేన్‌సింగ్‌ ప్రేరేపించారనే ఆరోపణలకు సంబంధించిన ఆడియో క్లిప్‌లపై కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్ట్‌(కోహుర్‌) అప్పట్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తొలుత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కోహుర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలను వినిపించారు. నవంబరు 14న జరిగిన విచారణలో.. సీఎం బీరేన్‌దిగా చెబుతున్న ఆడియో క్లిప్‌నకు ఫోరెన్సిక్‌ పరీక్ష నిర్వహించాలని.. అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్‌ ఎఫ్‌ఎ్‌సఎల్‌ ట్రూత్‌ ల్యాబ్స్‌లో ఆ పరీక్షలు జరిపేందుకు అనుమతినివ్వాలని కోరారు.

కోర్టు అనుమతితో ప్రశాంత్‌ భూషణ్‌ ట్రూత్‌ ల్యాబ్స్‌ను సంప్రదించగా.. గత నెల 18న నివేదిక వచ్చింది. ఆడియోలో ఉన్న వాయి్‌సకు.. సీఎం బీరేన్‌కు చెందిన వాయి్‌సకు మధ్య 93ు సారూప్యత ఉందని ట్రూత్‌ ల్యాబ్స్‌ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం విచారిస్తోంది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనానికి ట్రూత్‌ ల్యాబ్స్‌ నివేదికను సమర్పించారు.

అయితే విచారణ ప్రారంభానికి ముందు.. ధర్మాసనంలో తాను ఉండడం పిటిషనర్‌కు అభ్యంతరమా? అని జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ను పరోక్షంగా అడిగారు. దానికి ప్రశాంత్‌ భూషణ్‌ ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మణిపూర్‌ హింసకు సీఎం బీరేన్‌ ప్రేరేపించారని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్‌ వేసిన కోహుర్‌ సంస్థ వివాదాస్పదమైనదని.. రాజ్యాంగంలోని 226వ అధికరణ మేరకు ఈ కేసును మణిపూర్‌ హైకోర్టు విచారించాలని వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేసును మేము విచారించాలా? మణిపూర్‌ హైకోర్టా? అనేదాన్ని తదుపరి విచారణ సందర్భంగా నిర్ణయిస్తామని వ్యాఖ్యానించింది.

Also Read : Maha Kumbh Mela-Kharge : కుంభమేళాలో తొక్కిసలాట పై భగ్గుమన్న ఖర్గే..ఆ వ్యాఖ్యలను వినక్కి తీసుకోవాలని చైర్మన్

Leave A Reply

Your Email Id will not be published!