Security Advisor : మణిపూర్ లో పరిస్థితి అదుపులో ఉంది
రాష్ట్ర భద్రతా సలహాదారు వెల్లడి
Security Advisor : గత కొన్నిరోజులుగా మణిపూర్ అల్లర్లతో, హింసతో అట్టుడుకుతోంది. ఇరు వర్గాల దాడుల్లో 83 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ చీఫ్ పాండ్యా సందర్శించారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సందర్శించి పరామర్శించారు. అన్ని వర్గాలు , సంఘాలతో భేటీ అయ్యారు. వారందరితో జరిపిన చర్చలు ఫలించాయి. సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ మేరకు ఆర్మీ ఇక్కడే కొలువు తీరింది. ఎక్కడ చూసినా తుపాకులే కనిపిస్తున్నాయి. కనిపిస్తే కాల్చి వేయాలంటూ ఆదేశించింది ప్రభుత్వం. ఎవరు ఎప్పుడు దాడికి దిగుతారో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా మణిపూర్ రాష్ట్ర భద్రతా సలహాదారు(Security Advisor) కీలక ప్రకటన చేశారు. తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. ఈ మేరకు మణిపూర్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఎలాంటి హింసాకాండ జరగలేదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు స్వచ్చంధంగా బయటకు రావచ్చని, యధా విధిగా తమ కార్యకలాపాలు నిర్వహించు కోవచ్చని స్పష్టం చేశారు.
Also Read : S Jai Shankar