Manipur Violation : మణిపూర్ లో మళ్లీ మొదలైన హింసలో ఆరుగురి దుర్మరణం
రాకెడ్ దాడిలో బిష్ణుపూర్ జిల్లాలోని ఓ వృద్ధుడు మరణించిన మరుసటి రోజే ఈ హింస చెలరేగింది...
Manipur : జాతుల ఘర్షణల్లో కొంతకాలంగా మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం చెలరేగిన హింసాకాండలో ఆరుగురు మృతి చెందారు. శనివారంనాడు నిద్రలోనే ఒక వ్యక్తిని కుకీ సాయుధులు కాల్చిచంపడంతో కుకీ గిరిజనులు, మెయితీ సాయిధ గ్రూపు మధ్య కాల్పులకు దారితీసినట్టు చెబుతున్నారు. ఈ కాల్పుల్లోనే మరో ఐదుగురు మరణించినట్టు తెలుస్తోంది.
Manipur Violation Update
రాకెడ్ దాడిలో బిష్ణుపూర్ జిల్లాలోని ఓ వృద్ధుడు మరణించిన మరుసటి రోజే ఈ హింస చెలరేగింది. అయితే సాయుధ గ్రూపులు తమను తాము ‘విలేజ్ డిఫెన్స్ వాలంటీర్లు’గా చెప్పుకుంటున్నారని తెలుస్తోంది. కాగా, తాజా హింసాకాండ నేపథ్యంలో బిష్ణుపూర్, చురాచాంద్‌పుర్ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. రెండు బంకర్లను కూల్చివేశాయి. మిలిటెంట్లు ఈ బంకర్ల నుంచే రాకెట్ దాడులకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా చోపర్లను కూడా రంగంలోకి దింపారు.
Also Read : Deepthi Jeevanji : పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ సర్కార్