Manish Sisodia : నిజాయితీకి ప్రతిరూపం సీఎం అరవింద్ కేజ్రీవాల్

మరోవైపు జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా శనివారం ఉదయం తన భార్య సీమాతో కలిసి టీ తాగుతూ...

Manish Sisodia : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో జైలు నుంచి విడులవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఆయన్ని దెబ్బ తీసేందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ వినియోగించుకుంటుందని ఆరోపించారు. అందులోభాగంగానే కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆప్ నేతలపై తప్పడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుందని ఆయన మండిపడ్డారు. శనివారం న్యూఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మనీశ్ సిసోడియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు పార్టీ కార్యక్తరలే తమకు నిజమైన బలమన్నారు. తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం.. నియంత పాలనకు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు.

Manish Sisodia Comment

ఈ సందర్భంగా తన బెయిల్‌పై వాదనలు కొనసాగించిన తన తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్ మను సింఘ్వీ‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతకుముందు న్యూఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ సమాధిని మనీశ్ సిసోడియా(Manish Sisodia) సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. అలాగే కన్నాట్ ప్లేస్‌లోని హానుమాన్ దేవాలయాన్ని సైతం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు అందుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి హోదాలో మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. తీహాడ్ జైలుకు తరలించారు. అనంతరం ఇదే కేసులో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు కోర్టులను ఆశ్రయించారు. అయినా. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగస్ట్ 9వ తేదీన సుప్రీంకోర్టు..మనీశ్ సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శుక్రవారం విడుదలయ్యారు.

మరోవైపు జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా(Manish Sisodia) శనివారం ఉదయం తన భార్య సీమాతో కలిసి టీ తాగుతూ… సెల్పీ దిగారు. ఆ సెల్పీతోపాటు 17 నెలలకు లభించిన స్వేచ్చ తర్వాత ఉదయం ఇంట్లో టీ తాగుతున్నాను. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్చగా జీవించే హక్కు కల్పించింది. ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే హక్కును ఆ దేవుడు అందరికీ కల్పించాడంటూ కామెంట్ జత చేసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే శుక్రవారం జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోడియా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి.. అయన తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న విషయం విధితమే.

Also Read : Minister Ponnam : 2 లక్షల వరకు ఉన్న రుణ మాఫీలు ఈ వారం రోజుల్లో చేస్తాము

Leave A Reply

Your Email Id will not be published!