Manish Sisodia : డబ్బులు దొరకలేదు బెయిల్ ఇవ్వండి
కోర్టుకు విన్నవించిన మనీష్ సిసోడియా
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన ఆప్ నేత , ఢిమీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తనకు బెయిల్ ఇవ్వాలని(Manish Sisodia) కోరారు. ఈ మేరకు కోర్టుకు విన్నవించారు. వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు సిసోడియా తరపు న్యాయవాది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే లేదా సాక్ష్యాలను తారుమారు చేసే స్థితిలో మాజీ డిప్యూటీ సీఎం లేరని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ 34 మందిని అరెస్ట్ చేసింది. సిసోడియాతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించింది సీబీఐ. ఇప్పటికే మూడు సార్లు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ ముందు హాజరయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఎనిమిది గంటలకు పైగా ఆయనను విచారించింది.
ఇవాళ మనీష్ సిసోడియాకు(Manish Sisodia) సంబంధించిన బెయిల్ పిటిషన్ పై వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. జస్టిస్ దినేష్ కుమార్ శర్మ సిసోడియా తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత సీబీఐ న్యాయవాది సమర్పణలను ఏప్రిల్ 26న ఖరారు చేశారు. మార్చి 31న ట్రయల్ కోర్టు ఈ విషయంలో సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది.
Also Read : రాహుల్ అభ్యర్థన కోర్టు తిరస్కరణ