Marcus Stoinis : పంజాబ్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు లక్నో సూపర్ జెయింట్స్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ . కళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 257 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
మార్కస్ మారథాన్ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 40 బంతులు ఎదుర్కొన్న మార్కస్ స్టోయినిస్ 6 ఫోర్లు 5 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కలిపి 54 పరుగులు వచ్చాయి. మరో వైపు కైల్ మేయర్స్ సైతం మార్కస్ తో జత కలిసి దంచి కొట్టాడు. మైదానం నలు వైపులా కళ్లు చెదిరే షాట్స్ తో షాక్ ఇచ్చారు. ఇక కైల్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక భారీ షాట్స్ తో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ స్టార్ మార్కస్ కు(Marcus Stoinis) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతే కాదు కీలకమైన ఒక వికెట్ కూడా తీశాడు. మొత్తంగా ఈ లీగ్ మ్యాచ్ లో మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. తనకు ఎదురే లేదని చాటాడు.
అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ సూపర్ కింగ్స్ 201 పరుగులకే ఆలౌటైంది.
Also Read : కోల్ కతా గుజరాత్ బిగ్ ఫైట్