Marcus Stoinis : వీడు మామూలోడు కాదు మగాడు
కోల్ కతా పతనాన్ని శాసించిన మార్కస్
Marcus Stoinis : నరాలు తెగే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు లోక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బౌలర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis). నువ్వా నేనా అన్న రీతిలో గేమ్ జరిగింది.
ఈ కీలక పోరులో కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం చేసుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా 8 వికెట్ల కోల్పోయి 208 రన్స్ చేసింది. ఇక ఆఖరి ఓవరు కీలకంగా మారింది. అప్పటికే ధాటిగా పరుగులు ఇచ్చిన మార్కస్ స్టోయినిస్ పైనే నమ్మకాన్ని ఉంచాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.
ఇంకేం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. గెలుపు ఆశల అంచుల దాకా వెళ్లిన కోల్ కతా నైట్ రైడర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 19 ఓవర్లు ముగిశాయి.
ఆఖరి 20వ ఓవర్ లో 18 రన్స్ ఇచ్చి కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు స్టోయినిస్. చివరి ఓవర్ లో 21 రన్స్ చేయాల్సి ఉండగా రింకు సింగ్ మార్కస్ ను మొదటి నాలుగు బంతుల్లో 4, 6, 6, 2 కొట్టాడు.
కోల్ కతా ను విజయానికి దగ్గరకు చేర్చాడు. కానీ రింకూతో పాటు ఉమేష్ యాదవ్ ను పెవిలియన్ కు పంపించాడు ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ స్టోయినిస్.
రింకూ సింగ్ సిక్స్ కొట్టేందుకు యత్నించగా లూయిస్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఉమేష్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోల్ కతా కథ ముగిసింది. 2 పరుగుల తేడాతో ఓడి పోయింది. రియల్ హీరో మాత్రం మార్కస్ మాత్రమే.
Also Read : దుమ్ము రేపుతున్న ‘గుజరాత్’ బ్యాండ్