Mark Boucher : ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ గా బౌచ‌ర్

మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నేకు బిగ్ షాక్

Mark Boucher : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో కీల‌క‌మైన ఫ్రాంచైజీగా ఉన్న ముంబై ఇండియ‌న్స్ మేనేజ్ మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శుక్ర‌వారం త‌మ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా మార్క్ బౌచ‌ర్ ను (Mark Boucher) నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించింది.

వ‌చ్చే ఏడాది 2023లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ కు ప్ర‌ధాన కోచ్ గా ఉండ‌నున్నార‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా మార్క్ బౌచ‌ర్ ద‌క్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గ‌జంగా పేరొందారు. వికెట్ కీప‌ర్ గా కూడా పేరొందారు బౌచ‌ర్.

బ్యాటర్ గా కూడా సుదీర్ఘ‌మైన , ప్ర‌సిద్ద కెరీర్ క‌లిగి ఉన్నాడు. కీపింగ్ లో అత్య‌ధిక టెస్ట్ అవుట్ ల‌ను చేసిన రికార్డును కూడా క‌లిగి ఉన్నాడు బౌచ‌ర్.

మార్క్ బౌచ‌ర్ ద‌క్షిణాఫ్రికాలో అగ్ర స్థాయి క్రికెట్ ఫ్రాంచైజ్ అయిన టైటాన్స్ కు కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఐదు దేశీవాళీ టైటిల్స్ పొందేలా న‌డిపించాడు.

2019లో క్రికెట్ బోర్డు ద‌క్షిణాఫ్రికా ప్ర‌ధాన కోచ్ గా ఎంపిక చేసింది. 11 టెస్టు విజ‌యాలు , 12 వన్డేలు, 23 టి20 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించేలా చేశాడు మార్క్ బౌచ‌ర్(Mark Boucher).

ఇదిలా ఉండ‌గా రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మ‌న్ అయిన ముకేశ్ అంబానీ మాట్లాడారు. మార్క్ బౌచ‌ర్ ను ముంబై ఇండియ‌న్స్ కు స్వాగ‌తం ప‌ల‌క‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

మైదానంలో , దాని వెలుప‌ల అత‌డి నైపుణ్యం త‌మ జ‌ట్టుకు ఎంతో ఉప‌యోగ ప‌డుతుంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు.

త‌న‌ను ముంబై ఇండియ‌న్స్ కు హెడ్ కోచ్ గా నియ‌మించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు మార్క్ బౌచ‌ర్. జ‌ట్టు టైటిల్ గెలిచేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని చెప్పాడు.

Also Read : బాబార్ ఆజం కెప్టెన్సీ కోల్పోయే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!