Mark Waugh : ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జో రూట్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా.
పరిపూర్ణమైన ఆటగాడు మాత్రమే కాదని ప్రస్తుత ఆటగాళ్లే కాదు రాబోయే క్రికెటర్లకు జో రూట్ రోల్ మోడల్ అంటూ కితాబు ఇచ్చాడు. ఇంగ్లండ్ జట్టు పరంగా చూస్తే అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్ గా పేరొందాడు జో రూట్.
ఇదిలా ఉండగా టెస్టు కెప్టెన్సీ నుంచి జో రూట్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు – ఈసీబీ శుక్రవారం ప్రకటించింది.
యాషెస్ సీరీస్ తో పాటు విండీస్ పర్యటనలో ఇంగ్లండ్ పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. దీనికి బాధ్యత వహిస్తూ తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు జో రూట్.
0-4 తో ఆసిస్ సీరీస్ , 0-1 తో వెస్టిండీస్ తో ఇంగ్లండ్ ఓడి పోవడం ప్రపంచ క్రికెట్ అభిమానులను విస్తు పోయేలా చేసింది. దీంతో ఓటమికి పూర్తి బాధ్యత జో రూట్ దేనంటూ పెద్ద ఎత్తున తాజా, మాజీ క్రికెటర్లు మండి పడ్డారు.
కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత ఆసిస్ మాజీ క్రికెటర్ మార్క్ వాతో పాటు ఇతర ఆటగాళ్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ సందర్బంగా జో రూట్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
క్రికెటర్లకు స్పూర్తి దాయకమైన క్రికెటర్ అంటూ పేర్కొన్నాడు మార్క్ వా. నా దృష్టిలో జో రూట్ అత్యున్నతమైన నాణ్యత కలిగిన క్రికెటర్.
Also Read : సత్తా చాటిన నటరాజన్