Rajasthan: పాక్ తో పోరు వేళ రాజస్థాన్ లో బ్లాక్ అవుట్ ! మొబైల్ టార్చి వెలుగులో పెళ్లి !
పాక్ తో పోరు వేళ రాజస్థాన్ లో బ్లాక్ అవుట్ ! మొబైల్ టార్చి వెలుగులో పెళ్లి !
Rajasthan : ఆపరేషన్ సిందూర్ తో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల సరిహాద్దుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాత్రి అయితే చాలు దీపావళి మాదిరీ బాంబులు, డ్రోన్ల పేలుళ్ళతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దీనితో సరిహాద్దు గ్రామాల్లో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే శనివారం సాయంత్రం 5 గంటల నుండి కాల్పులను విరమిస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించడంతో… సరిహద్దు గ్రామాల ప్రజలు కాస్తా ఊపిరిపీల్చుకున్నారు. అయితే పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ డ్రోన్ల దాడికి తెగబడటంతో మరల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో మళ్ళీ బ్లాక్ అవుట్ విధించారు.
Rajasthan Sensational
భారత్ పాకిస్తాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా వైమానిక దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి రాజస్థాన్(Rajasthan) సరిహద్దు జిల్లాలను శనివారం రాత్రి పూర్తిగా బ్లాక్ అవుట్ చేశారు. దీనితో అప్పుడే జోధ్‌పుర్ లోని పావ్టా ప్రాంతంలో ఓ పెళ్లి జరుగుతోంది. సప్తపది ప్రారంభమయ్యే సమయానికి లైట్లు ఆరిపోయాయి. దీనితో పెళ్లికి వచ్చిన అతిథులు వెలిగించిన సెల్‌ఫోను లైట్ల వెలుతురులోనే వధువుతో వరుడు ఏడడుగులు నడిచాడు. తర్వాత పురోహితుడు మంత్రాలు చదువుతూ మిగతా వివాహ ఆచారాలను కూడా అదే వెలుతురులో పూర్తి చేశారు. ఈ సందర్భంగా దేశ భద్రత తమకు ముఖ్యమని… వరుడి కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం పెట్టండి – కాంగ్రెస్
భారత్(India), పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయనే ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించి జరిగిన పరిణామాలను అన్ని పార్టీల నేతకు వివరించాలని కోరింది. అలాగే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. మరోపక్క, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైన్యంతో కలిసి ఉన్న ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేసిన కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా.. ఇందిర లేని లోటు దేశంలో కనిపిస్తుంది అనే అర్థం వచ్చేలా ‘‘ఇండియా మిసెస్ ఇందిరా’’ అనే శీర్షిక పెట్టారు.
Also Read : Chhattisgarh: టెన్త్ లో స్టేట్ టాపర్ ! కట్ చేస్తే బ్లడ్‌క్యాన్సర్ తో చావుబ్రతుకుల మధ్య విద్యార్థిని !