RC Bhargava : సమిష్టి కృషితోనే మారుతీ సక్సెస్
మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ
RC Bhargava : ఏ సంస్థ అయినా ముందుకు వెళ్లాలంటే , లాభాల బాటలో ప్రయాణం చేయాలంటే ముందు కావాల్సింది సమిష్టిగా పని చేయడం. ఇదొక్కటే కంపెనీని నిలబెట్టేలా చేస్తుంది.
అంతే కాదు నాణ్యత, నమ్మకం, నిబద్దత, సమయ పాలన కూడా కీలకంగా పోషిస్తాయని స్పష్టం చేశారు ప్రముఖ భారతీయ ఆటో మొబైల్ కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ(RC Bhargava).
మారుతిది ఇండియా అయితే సుజుకి జపాన్ ది. రెండూ కలిసి మారుతీ సుజుకీ గా(Maruthi Suzuki) రూపాంతరం చెందాయి. ఈ సంస్థ భారత దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి నేటితో 40 ఏళ్లు పూర్తవుతున్నాయి.
ఈ సందర్భంగా చైర్మన్ ఆర్సీ భార్గవ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వాహనదారుల అభిరుచులు, అభిప్రాయాలకు అనుగుణంగా తాము కార్లను , ఇతర విడి భాగాలను తయారు చేస్తూ వస్తున్నామని చెప్పారు.
ప్రపంచం మారుతోంది. టెక్నాలజీ పరంగా, ఇతర రంగాలలో కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మేరకు వాటితో కూడా మనం పోటీ పడక పోతే వెనకనే ఉండి పోతామన్నారు.
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమలో భారత దేశం కీలకమైన స్థానంలో ఉందన్నారు ఆర్సీ భార్గవ. కార్ల తయారీ కంటే ఎక్కువగా విడి భాగాల తయారీలోనే ఎక్కువగా ఆదాయం వస్తోందని చెప్పారు చైర్మన్.
మరో వైపు మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్ గా నిలిచిందన్నారు. భారత్ లో ఎన్నో కంపెనీలు వచ్చినా టాప్ లో మాత్రం ఎప్పటికీ నిలుస్తూ వస్తోంది మారుతీ సుజుకీ(RC Bhargava).
Also Read : ట్విట్టర్ కంపెనీగా మారడం బాధాకరం