Bhagwant Mann : మాస్ లీడ‌ర్ భ‌గ‌వంత్ మాన్

పంజాబ్ సీఎంగా ప్ర‌మాణం

Bhagwant Mann : పంజాబ్ రాష్ట్రంలో స‌రికొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). మొద‌ట కామెడీ చేస్తూ నవ్వించాడు. ఆ త‌ర్వాత ప‌రిపూర్ణ‌మైన న‌టుడిగా మారారు.

అనంత‌రం రాజ‌కీయాల్లోకి ఎంట‌ర‌య్యాడు. ఎంపీగా సింగ్రూర్ నుంచి గెలుపొందాడు. పార్ల‌మెంట్ సాక్షిగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు.

త‌న‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప‌ట్టించు కోలేదు.

తాను అనుకున్న‌ది సాధించేందుకు య‌త్నించాడు. త‌న కెరీర్ లో ఊహించ‌ని స్థాయికి చేరుకున్నాడు.

పంచులు..ప్రాస‌ల‌తో సెటైర్లు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి భ‌గ‌వంత్ మాన్.

మాన్ లోని మంచిత‌నం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను గుర్తించారు ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

తాజాగా జ‌రిగిన రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో ఆప్ దుమ్ము రేపింది.

117 సీట్ల‌కు గాను ఏకంగా 92 సీట్లు కైవసం చేసుకుంది. ఎన్నిక‌ల కంటే ముందే ఆప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టింది. పంజాబ్ కు ఎవ‌రు సీఎంగా ఉండాల‌ని కోరుకుంటున్నారోన‌ని స‌ర్వే చేప‌ట్టింది.

ఇందులో భాగంగా 90 శాతానికి పైగా ప్ర‌జ‌లు భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann)ఉండాల‌ని స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆప్ ను త‌క్కువ‌గా అంచ‌నా వేసింది.

ఆ పార్టీతో పాటు ఇత‌ర పార్టీలకు ఆప్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ త‌రుణంలో ధురి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన భ‌గ‌వంత్ మాన్ భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు.

ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి పంజాబ్ రాష్ట్ర ఆఫీసుల్లో సీఎం , పీఎం ఫోటో ఉండ‌ద‌న్నారు.

ఎక్కువ‌గా తాను ఇష్ట‌ప‌డే ఇద్ద‌రు ధీరోదాత్తులు, లెజెండ్స్ ఉంటార‌ని స్ప‌ష్టం చేశాడు.

వారిలో ఒక‌రు దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన భ‌గ‌త్ సింగ్ కాగా మ‌రొక‌రు రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్. అంతే కాదు పంజాబ్ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుట్టారు మాన్.

రాజ్ భ‌వ‌న్ లో కాకుండా భ‌గ‌త్ సింగ్ పుట్టిన ఊరు ఖ‌ట్క‌ర్ కలాన్ లో ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించాడు.

Also Read : గోవాలో కొత్త స‌ర్కార్ పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!