AP Police Recruitment : ఏపీలో భారీగా పోలీస్ రిక్రూట్మెంట్
6,511 ఎస్ఐ..కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
AP Police Recruitment : ఓ వైపు తెలంగాణలో ఒక్క పోస్ట్ భర్తీ చేయక పోగా పక్కనే ఉన్న ఏపీలో మాత్రం జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోనే జాబ్స్ ఎక్కువగా నియమించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కొలువుల నింపడంపై ధ్యాస మరిచారు. తాజాగా భారీ ఎత్తున పోలీసుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.
ఈ మేరకు 6,511 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్(AP Police Recruitment) విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ, రిజర్వ్ సబ్ ఇన్స్ పెక్టర్ , కానిస్టేబుల్ , ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఏపీ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఈ జాబ్స్ కోసం పురుషులు, మహిళలు అర్హులేనని, దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ఇదిలా ఉండగా ఒక్క ఏపీఎస్పీ ఆర్ఎస్సై పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది బోర్డు. అప్లై చేసుకునే వారు ఇంటర్ తో పాటు డిగ్రీ కోర్సులో పాసై ఉండాలని తెలిపింది.
వయో పరిమితి విషయంలో రిజర్వేషన్ కేటగిరీలకు అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో వచ్చే ఏడాది 2023 జనవరి 18 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కానిస్టేబుల్ పోస్టులకు మాత్రం డిసెంబర్ 28 వరకు మాత్రమే గడువు ఉంటుందని తెలిపింది.
సాధారణ అభ్యర్థులు రూ. 300, రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారు రూ. 150 ఫీజు కింద చెల్లించాలి. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న పరీక్ష ఉంటుంది.
Also Read : నోటిఫికేషన్లు సరే కొలువుల జాడేది