Mayank Markande : మ్యాజిక్ చేసిన మయాంక్ మార్కండే
పంజాబ్ పతనాన్ని శాసించిన బౌలర్
Mayank Markande : ఐపీఎల్ 16వ సీజన్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో కొందరు తేలి పోతే మరికొందరు ఆశించిన మేర రాణించ లేక పోతున్నారు. ఇక తక్కువ ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్లు మాత్రం దుమ్ము రేపుతున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్(SRH) వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులే చేసింది.
వరుస విజయాలతో ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపించాడు హైదరాబాద్ బౌలర్ మయాంక్ మార్కండే. 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పంజాబ్ బ్యాటర్లు మార్కండే బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. 9వ ఓవర్ లో ప్రమాకరమైన సామ్ కరమ్ ను ఔట్ చేశాడు.
తర్వాతి ఓవర్ లో షారుఖ్ ఖాన్ ను బోల్తా కొట్టించాడు. రాహుల్ చహర్ కూడా ఇదే బంతికి 13 ఓవర్ లో దొరికి పోయాడు మార్కండేకు. చివరగా మయాంక్ 15వ ఓవర్ లో ఎల్లిస్ స్టంప్ లను చెదరగొట్టాడు. ఇక మయాంక్ మార్కండే(Mayank Markande) 2018 ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్ లలో 15 వికెట్లు తీశాడు.
Also Read : కోల్ కతా షాక్ గుజరాత్ కు ఝలక్