Mayawati : యూపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరోసారి బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మాయవతి(Mayawati ). తమ పార్టీ ఈసారి మైనార్టీ ఓటర్లను ఎక్కువగా నమ్ముకుందని కానీ ఆ ఓట్లే తమ పార్టీని కోలుకోలేకుండా చేశాయంటూ ఆరోపించారు.
తమ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న వీరి ఓట్లను సమాజ్ వాది పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ చీల్చాయని దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో తాము అట్టడగు స్థాయికి చేరుకున్నామని ఇది ఆలోచించాల్సిన అంశమన్నారు.
కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు నిరాశ చెందవద్దని మనకంటూ ఓ రోజు తప్పక వస్తుందన్నారు మాయావతి(Mayawati ). ఆ ఓటర్లు ఆయా పార్టీలకు మళ్లడంతో తమ విజయావకాశాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల ఫలితాలు తమను కోలుకోలేకుండా చేశాయని పేర్కొన్నారు. మైనార్టీ కమ్యూనిటీపై నమ్మకం ఉంచినందుకు తగిన శాస్తి చేశారంటూ మండిపడ్డారు మాయావతి.
తమ పార్టీకి ముఖ్యంగా తనకు ఓ పెద్ద గుణపాఠం అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానంగా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు బీఎస్పీ చీఫ్. ముస్లిం, దళితుల ఓట్లు గణనీయంగా ఇరు పార్టీలు చీల్చాయన్నారు.
ఇది ఊహించని తట్టుకోలేని షాక్ . ఒక్క సీటు రావడం తనను బాధకు గురి చేసిందన్నారు. ఎస్పీ పూర్తిగా గేమ్ ప్లాన్ మార్చేసిందని దానిని తాము గమనించ లేక పోయామన్నారు.
ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తమ పట్ల వ్యతిరేకత కలిగి ఉంటారని ఊహించ లేక పోయామని ఇదే దెబ్బ కొట్టిందన్నారు.
Also Read : దిగ్గజాల కలయికపై సర్వత్రా ఆసక్తి