Mayor R Priya : చుట్టుపక్క రాష్ట్రాలతో పోలిస్తే చెన్నైలోనే ఆస్తి పన్ను తక్కువగా ఉంది
2022లో అతి తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను పెంచడం జరిగిందన్నారు...
R Priya : పొరుగు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే ఆస్తి పన్ను మన రాష్ట్రంలోనే తక్కువగా ఉందని చెన్నై నగర మేయర్ ఆర్.ప్రియ తెలిపారు. గురువారం చెన్నై కార్పొరేషన్ 44వ వార్డులో రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబుతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చెన్నై నగర పాలక సంస్థలో గత పదేళ్ళలో ఆస్తి పన్నును పెంచలేదని గుర్తు చేశారు.
Mayor R Priya Comment
2022లో అతి తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను పెంచడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే మన రాష్ట్రంలోనే ఆస్తిపన్ను తక్కువగా ఉందన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నగర రహదారులు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఈ రోడ్లపై ప్యాచ్ వర్క్‌లు సాగుతున్నాయని చెప్పారు. మరమ్మతులు చేయలేని రహదారులను మాత్రం కొత్తగా వేస్తున్నామన్నారు.
Also Read : K Haribabu : ఒడిశా నయా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ సీనియర్ నేత