Brendon Mc Cullum : ఇంగ్లండ్ కోచ్ రేసులో మెక్‌కల్లమ్
ఆసక్తి చూపుతున్న మాజీ క్రికెటర్
Brendon Mc Cullum : ఎవరికి ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో చెప్పలేం. క్రికెట్ లో సైతం కొందరు ఆటగాళ్లు తమ దారి తాము చూసుకుంటే మరికొందరు వివిధ రూపాలలో క్రికెట్ కు సేవలు అందిస్తున్నారు.
ఇంకా తమలో సత్తా ఉందని చాటుతున్నారు. ఏ జట్టుకైనా కావాల్సింది నైపుణ్యం కలిగిన కోచ్. సారథి బలంగా ఉన్నా రథ సారథి అన్నది ప్రధానం. ఎందుకంటే ప్రత్యర్థి జట్లను ఎలా ఢీకొనాలి.
ఎలా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ఏ సమయంలో ఎలా నెగ్గాలనే దానిపై వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నడంలో హెడ్ కోచ్ లు ప్రధాన పాత్ర వహిస్తారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.
ఎందుకంటే ఒకప్పుడు ఫుట్ బాల్ ఉండేది. దాని స్థానంలో క్రికెట్ చేరింది. అమెరికా లాంటి దేశం సైతం క్రికెట్ ఆట పట్ల మక్కువ చూపుతోంది. అంటే దాని ప్రభావం ఎలా పెంచుకుంటూ పోతోందో తెలుస్తుంది.
ఇక వరుస అపజయాల బాట పట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సమర్థవంతమైన కోచ్ కావాలని అనుకుంటోంది ఇంగ్లండ్ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఈ మేరకు జల్లెడ పడుతోంది.
ఎవరైతే బాగుంటారనే విషయంలో జాబితా సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఓటమి దెబ్బకు కోచ్ గా పని చేసిన క్రిస్ సిల్వర్ వుడ్ పై వేటు వేసింది. ఆ తర్వాత పరాజయానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ జో రూట్ గుడ్ బై చెప్పాడు.
అతడి స్థానంలో బెన్ స్టోక్ వచ్చాడు. ఇప్పుడు కోచ్ గా ఎవరు వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కీవీస్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ (Brendon Mc Cullum)ను ఎంపిక చేయనున్నట్లు టాక్.
Also Read : డేవిడ్ వార్నర్ వరల్డ్ రికార్డ్