S Jai Shankar : అర్జెంటీనా మంత్రితో జై శంక‌ర్ భేటీ

మ‌ధ్య‌లో మెస్సీ జెర్సీ కూడా

S Jai Shankar : భార‌త దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. సోమ‌వారం అర్జెంటీనా మంత్రితో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో అణు శ‌క్తి, అంత‌రిక్షం, డిజిట‌ల్ , ర‌క్ష‌ణ , బ‌యో టెక్నాల‌జీలో ద్వైపాక్షిక స‌హ‌కారంపై ఇద్ద‌రు మంత్రులు చర్చించారు.

ఈ కీల‌క భేటీలో జైశంక‌ర్ తో పాటు ఆ దేశ మంత్రి డేనియ‌ల్ ఫిలిమ‌స్ తో ములాఖ‌త్ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఓ వైపు భారత జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ అమెరికా టూర్ ముగించుకుని లండ‌న్ కు చేరుకున్నారు. అక్క‌డ పీఎం రిషి సున‌క్ తో భేటీ అయ్యారు. ర‌క్ష‌ణ సంబంధ అంశాల‌పై చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో అర్జెంటీనాలో జై శంక‌ర్(S Jai Shankar) ప‌ర్య‌టించడం విశేషం.

ఈ స‌మావేశంలో వాణిజ్య పెట్టుబ‌డులు , స‌హ‌కారాన్ని విస్త‌రించ‌డం , ద‌క్షిణ స‌హ‌కారానికి ఉదాహ‌ర‌ణ‌గా ప‌ని చేయ‌డంపై కూడా జై శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య ప్ర‌ధానంగా ప్ర‌పంచాన్ని పీడిస్తున్న స‌వాళ్ల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై కూడా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు జై శంక‌ర్. ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని పంచుకున్నారు.

అంత‌కు ముందు గ‌త ఏడాది 2022 ఆగ‌స్టులో అర్జెంటీనా అధ్య‌క్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ తో స‌మావేశం కావ‌డం జ‌రిగింది. ఇక జై శంక‌ర్ ఆర్థిక మ‌త్రి సెర్గియో మాస్సాతో కూడా స‌మావేశం అయ్యారు. ఆర్థిక స‌హ‌కారాన్ని విస్త‌రించ‌డం ప‌ట్ల సానుకూల దృక్ప‌థాన్ని ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్బంగా మెస్సీ ధ‌రించిన జెర్సీని ఇద్ద‌రూ ఆస‌క్తిగా చూశారు.

Also Read : అదానీ సంక్షోభం కాంగ్రెస్ ఆగ్ర‌హం

PM Modi : ట‌ర్కీకి స‌హాయం చేస్తాం – న‌రేంద్ర మోదీ

Leave A Reply

Your Email Id will not be published!