Victoria Gowri Row : గౌరీ నియామ‌కం న్యాయ‌వాదుల ఆగ్ర‌హం

విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు

Victoria Gowri Row : మ‌ద్రాస్ హైకోర్టుకు మ‌హిళా న్యాయ‌మూర్తిగా విక్టోరియా గౌరి(Victoria Gowri Row)  నియ‌మితుల‌య్యారు. అయితే ఆమె నియామ‌కం చెల్ల‌దంటూ న్యాయ‌వాదులు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. గ‌తంలో ఆమె మైనార్టీల‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసిందంటూ పేర్కొన్నారు. విక్టోరియా గౌరి చేసిన కామెంట్స్ న్యాయ వ్య‌వ‌స్థ స్వ‌తంత్రత‌ను దెబ్బ తీస్తుంద‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా న్యాయ‌వాది ల‌క్ష్మ‌ణ చంద్ర విక్టోరియా గౌరీని మ‌ద్రాస్ హైకోర్టు జ‌డ్జీగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ కొలీజియం సిఫార‌సు చేసింది. ఆమెను సిఫార‌సు చేయ‌డాన్ని చెన్నై లోని న్యాయ‌వాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ సోమ‌వారం ఈ అంశాన్ని శుక్ర‌వారం జాబితా చేసేందుకు అంగీక‌రించారు.

ఇదిలా ఉండ‌గా మ‌ద్రాస్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా గౌరీ నియామ‌కానికి(Victoria Gowri Row) కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేప‌థ్యంలో న్యాయ‌వాదులు సుప్రీంను ఆశ్ర‌యించింది.

కాగా భార‌త రాజ్యాంగం లోని సంబంధిత రూల్స్ ప్ర‌కారం అల‌హాబాద్ హైకోర్టు, క‌ర్ణాట‌క హైకోర్టు, మ‌ద్రాస్ హైకోర్టుల అద‌న‌పు న్యాయ‌మూర్తులుగా న్యాయ‌వాదులు, న్యాయాధికారుల‌ను నియ‌మించిన‌ట్లు ప్ర‌క‌టించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.

గ‌తంలో మైనార్టీల‌కు వ్య‌తిరేకంగా గౌరీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిందంటూ పిటిష‌న్ లో న్యాయ‌వాదులు పేర్కొన్నారు. ఇది పూర్తిగా న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఆటంకం క‌లిగిస్తుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. చంద్ర‌చూడ్, జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్ , కేఎం జోసెఫ్ ల‌తో కూడిన కొలీజియం జ‌న‌వ‌రి 17న గౌరీతో పాటు మ‌రో న‌లుగురు న్యాయ‌వాదుల పేర్ల‌ను హైకోర్టుకు ప్ర‌తిపాదించింది.

Also Read : కాంగ్రెస్ నోటీస్ ఎంపీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!