MP Preneet Kaur : కాంగ్రెస్ నోటీస్ ఎంపీ సీరియ‌స్

ఏమైనా చేసుకోండ‌న్న కౌర్

MP Preneet Kaur : పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డారంటూ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ ప్ర‌ణీత్ కౌర్(MP Preneet Kaur) కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది ఎంపీ.

మీరు ఏమైనా త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చంటూ మండిప‌డింది. ఇదిలా ఉండ‌గా ఎంపీపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , ఇత‌ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఆమెను పార్టీ నుండి స‌స్పెండ్ చేసింది.

మీకు ఏది కావాల‌ని అనుకుంటే అది చేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ నిప్పులు చెరిగింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌ణీత్ కౌర్ ఎవ‌రో కాదు ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ పార్టీకి చెందిన అమ‌రీంద‌ర్ సింగ్ భ‌ర్త‌.

ఆయ‌న గ‌తంలో పంజాబ్ రాష్ట్రానికి సీఎంగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత సిద్దూ దెబ్బకు రాజీనామ చేశారు. ఆపై కొత్త‌గా పార్టీ పెట్టారు. దానిని భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. భ‌ర్త బీజేపీలో భార్య కాంగ్రెస్ లో ఉండ‌డంతో ఆ పార్టీ కీల‌క చ‌ర్య‌ల‌కు దిగింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ణీత్ కౌర్(MP Preneet Kaur) ఎదురు దాడికి దిగారు. ఆమె కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య క‌మిటీ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ తారిఖ్ అన్వ‌ర్ పై మండిప‌డ్డారు. గాంధీ విధేయుడ‌న్న అంశంపై 1999లో కాంగ్రెస్ పార్టీని వీడి 20 ఏళ్లుగా బ‌య‌టే ఉండ‌డం చూసి తాను ఆశ్చ‌ర్యానికి గురైన‌ట్లు చెప్పారు. 19 ఏళ్ల త‌ర్వాత పార్టీని వీడి తిరిగి 2018లో వ‌చ్చారు. ఆయ‌న త‌న‌కు నోటీసు జారీ చేయ‌డం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు ఎంపీ ప్ర‌ణీత్ కౌర్.

Also Read : మేయ‌ర్ ఎన్నికపై సుప్రీంకు ఆప్

Leave A Reply

Your Email Id will not be published!