Congress Adani Row : అదానీ సంక్షోభం కాంగ్రెస్ ఆగ్ర‌హం

దేశ వ్యాప్తంగా భారీ నిర‌స‌న

Congress Adani Row : అదానీ హిండెన్ బ‌ర్గ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిర‌స‌న చేప‌ట్టింది. అదానీ గ్రూప్ లో ప్ర‌భుత్వ ఆధీనంలోని భార‌తీయ జీవిత బీమా సంస్థ‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సంస్థ‌లు భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాయ‌ని దీని వ‌ల్ల కోట్లాది మంది భార‌తీయుల‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొంది.

వారిని ర‌క్షించేందుకే తాము ఆందోళ‌న చేప‌ట్టామ‌ని తెలిపింది కాంగ్రెస్. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , ఇత‌ర నాయ‌కులు, ఎంపీలు అదానీ సంక్షోభంపై సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌రిపించాల‌ని(Congress Adani Row) డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు.

హిండెన్ బ‌ర్గ్ నివేదిక అదానీ చేస్తున్న మోసాల‌ను బ‌ట్ట బ‌య‌లు చేసింది. 10 వేల కోట్ల మార్కెట్ విలువ‌ను కోల్పోయేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దేశ‌మంత‌టా నిర‌స‌న తెలిపారు.

ఎల్ఐసీ, ఎస్బీఐల ముందు ఆందోళ‌న చేప‌ట్టారు. కొన్ని చోట్ల పోలీసుల‌కు , నాయ‌కుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఇదిలా ఉండ‌గా అదానీ, హిండెన్ బ‌ర్గ్ గొడ‌వ‌ల మ‌ధ్య ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఆనంద్ మ‌హీంద్రా భార‌త్ పై బెట్టింగ్ చేయొద్దంటూ హెచ్చ‌రించాడు.

ప్ర‌జా ధ‌నం దోచుకునేందుకు దొడ్డి దారిన ప్ర‌ధాన మంత్రి మోదీ అదానీ గ్రూప్ లో పెట్టుబ‌డులు పెట్టేలా చేశాడంటూ ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గ‌గే. వెంట‌నే ఈ స్కాంపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

మోదీకో హ‌ఠావో దేశ్ కీ బ‌చావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదానీని ఎందుకు వెన‌కేసుకు వ‌స్తున్నారో ప్ర‌ధాని మోదీ చెప్పాల‌ని డిమాండ్ చేశాయి ప్ర‌తిపక్షాలు. పూర్తిగా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు కేసీ వేణుగోపాల్ , జైరాం ర‌మేష్‌.

Also Read : ఇంధ‌న రంగానిదే భ‌విష్య‌త్తు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!