IRCTC Whats App : వాట్సాప్ ద్వారా రైళ్ల‌లో ఫుడ్ ఆర్డ‌ర్

ప్ర‌క‌టించిన కేంద్ర రైల్వే శాఖ

IRCTC Whats App : రైల్వే ప్ర‌యాణీకుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది రైల్వే శాఖ‌. ఇవాళ ప్ర‌తి ఒక్క‌రు వాట్సాప్ ను వాడుతున్నారు. దీనిని వాడే వారి సంఖ్య కోట్ల‌ల్లో ఉంటుంది. ఇక ఈ మ‌ధ్య‌న అద‌న‌పు ఆదాయాన్ని పొందేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతోంది రైల్వే శాఖ‌. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే వందే భార‌త్ రైళ్ల‌ను ప్ర‌వేశ పెట్టింది.

త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వేగంతో గ‌మ్య స్థానాల‌ను చేర్చే ప్లాన్ చేప‌ట్టింది. ఇది స‌క్సెస్ అయ్యింది. ఇక రైళ్ల‌ల్లో ఫుడ్ ను ఆర్డ‌ర్ చేసేందుకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు ప‌డాల్సిన ప‌ని లేదు. వాట్సాప్(IRCTC Whats App) ద్వారా త‌మ‌కు కావాల్సిన ఐట‌మ్స్ ను కోరితే వెంట‌నే మీకు స‌ర్వ్ చేయ‌బ‌డుతుంద‌ని రైల్వే శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి కొత్త సేవ‌ను ప్రారంభించింది.

ఇండియ‌న్ రైల్వేస్ కు సంబంధించిన పీఎస్ యు, ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) సోమ‌వారం త‌న ఇ కేట‌రింగ్ సేవ‌ల‌ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా క‌స్ట‌మ‌ర్ సెంట్రిక్ చేసేందుకు వాట్సాప్ ద్వారా ప్ర‌యాణీకుల కోసం ఇ కేట‌రింగ్ సేవ‌ల‌ను ప్ర‌వేశ పెట్టింది. ఇక నుంచి రైలులో ప్ర‌యాణం చేసే వారు ఎవ‌రైనా వాట్సాప్ ద్వారా ఫుడ్ ను బుక్ చేసుకోవ‌చ్చు.

దీని వ‌ల్ల అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని భావిస్తోంది ఐఆర్సీటీసీ . కాగా ఇ క్యాట‌రింగ్ యాప్ ఫుడ్ ఆన్ ట్రాక్ ద్వారా ప్ర‌యాణీకుల‌కు సేవ‌లు అంద‌జేస్తోంది. ఇందు కోసం రైల్వేస్ బిజినెస్ వాట్సాప్ నెంబ‌ర్ +91-8750001323ని స్టార్ట్ చేసింది.

Also Read : న‌ర్సుల వివాదం బాల‌య్య ప‌శ్చాతాపం

Leave A Reply

Your Email Id will not be published!