Meghana Aggarwal : కలలకు సాకారం సక్సెస్ కు సోపానం
మేఘనా అగర్వాల్ అద్భుత కథ
Meghana Aggarwal : మేఘనా అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. కానీ సాధించిన సక్సెస్ మాత్రం స్పూర్తిదాయకం. రాజస్థాన్ లోని అల్వార్ లోని ఓ చిన్న పట్టణం నుండి ఒక వ్యాపారవేత్తగా మారే దాకా ఆమె చేసిన జర్నీ గొప్పది. విలువైన సందేశాన్ని ఇస్తుంది. మీరు మీ ప్రయత్నాలలో పట్టుదలతో ఉంటే , మీ కలలకు రెక్కలు తొడగాలని అనుకుంటే సక్సెస్ మీ వశం తప్పక అవుతుందని అంటారు మేఘనా అగర్వాల్(Meghana Aggarwal).
హైర్ ప్రో కన్సల్టింగ్ ను స్థాపించిన సమయంలో ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. ఆ తర్వాత అల్ట్రా పైన్ మినరల్స్ పరిశ్రమకు నాయకత్వం వహించింది. మేఘనా అగర్వాల్ రిషితో కలిసి స్టార్ట్ చేసిన ఇండిక్యూబ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ సంస్థగా రూపు దిద్దుకుంది. బ్లూ స్టోన్ , కేపీఎంజీ, ఫ్రెష్ మెనూ, కోహెసిటీ , టీఎంఎఫ్ వంటి కంపెనీలను ఆన్ బోర్డ్ చేసింది. ఇండీ క్యూబ్ కు భారీ ఎత్తున ఫండింగ్ పొందారు. ఆరు నగరాలకు విస్తరించారు. 20వ స్థానంలో ఉంది. ఆసియా లో 112వ ప్లేస్ లో కొనసాగుతోంది.
వర్క్ స్పేస్ ప్రొవైడర్ గా ఇండీక్యూబ్ పని చేస్తోంది. కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది. నా ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నన్ను అమితంగా ప్రేరేపించిందని స్పష్టం చేసింది మేఘనా అగర్వాల్(Meghana Aggarwal). హైర్ ప్రో నుండి ఇండిక్యూబ్ దాకా 15 ఏళ్ల పాటు సాగింది ఆమె కెరీర్. ఈ సందర్భంగా తాను నేర్చుకున్న పాఠం ..సమయాన్ని, వేగాన్ని బ్యాలెన్స్ చేయడం అని స్పష్టం చేసింది మేఘనా అగర్వాల్. అవును ఆమె ఎందరికో స్పూర్తి దాయకంగా మారడం విశేషం కదూ.
Also Read : ప్రేరణ’ లెర్నింగ్ యాప్ పవర్ ఫుల్