Mehbooba Mufti : బడా బాబుల కోసమే ఈ బడ్జెట్
మెహబూబా ముఫ్తీ కేంద్రంపై ఫైర్
Mehbooba Mufti : కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు పీడీఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) . ఆమెతో పాటు ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ , బీఎస్పీ చీఫ్, మాజీ సీఎం మాయవతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదన్నారు. దీని వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర బడ్జెట్ ను తయారు చేశారని ఆరోపించారు. మౌలిక వసతుల కల్పన ప్రస్తావన ఎక్కడుందన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్రమైన సమస్యలుగా మారాయని దీనిపై ఎందుకు నోరు విప్పలేదంటూ ప్రశ్నించారు. కేంద్రం తమ ఆధీనంలో కొనసాగుతున్న కర్ణాటక రాష్ట్ర సర్కార్ కు ఏకంగా రూ. 5,300 కోట్లు ఎలా కేటాయిస్తారంటూ ఫైర్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే బిజేపీయేతర రాష్ట్రాలకు ఎందుకు నిధులు కేటాయించ లేదంటూ ప్రశ్నించారు మెహబూబా ముఫ్తీ.
సామాన్యులకు ఆసరాగా నిలవాల్సింది కేంద్ర సర్కార్. కానీ బాధ్యతలను విస్మరించిందని ఇందుకు నిదర్శనమే కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రధానంగా పేదలకు అందజేస్తున్న సబ్సిడీలను కావాలని తగ్గించారని దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti).
మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన బడ్జెట్ కేవలం బడా బాబులు, కార్పొరేట్లు , బడా వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేలా ఉందని ఎద్దేవా చేశారు.
Also Read : కేంద్ర బడ్జెట్ పై మాయావతి ఫైర్