MI IPL 2023 Auction : హిట్టర్లు..యువ ఆటగాళ్లపై ముంబై ఫోకస్
రూ. 17.50 కోట్లకు కామెరూన్ కొనుగోలు
MI IPL 2023 Auction : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ . రిలయన్స్ దిగ్గజ కంపెనీకి చెందిన ఈ జట్టు ఊహించని రీతిలో ఏకంగా రూ. 17.50 కోట్లకు ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ కామెరూన్ ను చేజిక్కించుకుంది. సామాన్యంగా తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఆ ఫ్రాంచైజీకి అలవాటు.
కానీ ఈసారి తన రూట్ మార్చేసింది. ప్రధానంగా హిట్టర్లు, యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్ కప్ పై కన్నేసింది. ఈ ఏడాది 2022లో జరిగిన ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.
ఐపీఎల్ ఛాంపియన్ గా ఉన్న ఆ జట్టుకు కోచ్ జయవర్దనేను తప్పించింది మేనేజ్ మెంట్. కేవలం టోర్నీలో 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచింది. ఇక వేలం పాటకు ముందు ముంబై ఇండియన్స్(MI IPL 2023 Auction) 13 మంది ప్లేయర్లను విడుదల చేసింది.
విడుదల చేసిన ఆటగాళ్లలో సంజయ్ యాదవ్ , టై మిల్స్ , మెరిడిత్ , బుద్ది, మురుగన్ అశ్విన్ , మార్కండే , ఉనాద్కత్ , ఫాబిన్ ఆలిన్ , సామ్స్ , తంపి, ఆర్యన్ జుయల్ , ప్రీత్ సింగ్ , కీరన్ పొలార్డ్ ఉన్నారు.
మినీ వేలం పాటలో రాఘవ్ గోయల్ , పీయూష్ చావ్లా, ఝే రిచర్డ్ సన్ , నేహళ్ వధేరా, షామ్స్ ములని, కామెరాన్ గర్ఈన్ , డయున్ జాన్సన్ , విష్ణు వినోద్ కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.
Also Read : దమ్మున్న ఆటగాళ్లతో ఢిల్లీ క్యాపిటల్స్