MI vs RCB IPL 2023 : ముంబై ఇండియన్స్ షాన్ దార్ విక్టరీ
4 వికెట్ల తేడాతో ఘన విజయం
MI vs RCB IPL 2023 : ఆరంభంలో పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గాడిలో పడింది. ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఏకంగా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చింది. ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. ఇది ఊహించని పరిణామం. మొన్నటి దాకా టాప్ లో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ 5వ స్థానానికి పడి పోయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 200 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. తనకు ఎదురే లేదని చాటింది.
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రోహిత్ సేన దుమ్ము రేపింది. ముంబై స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ రెచ్చి పోయాడు. 35 బంతులు మాత్రమే ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్(MI vs RCB IPL 2023) గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. సూర్యతో పాటు వధేరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 52 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
అంతకు ముందు ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ దంచి కొట్టాడు. ఆర్సీబీ బౌలర్లపై దాడి చేశాడు. 42 రన్స్ చేశాడు. ఎప్పటి లాగే రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. హసరంగ బౌలింగ్ లో 7 రన్స్ కే ఔట్ అయ్యాడు.
అంతకు ముందు బెంగళూరు జట్టులో గ్లెన్ మాక్స్ వెల్ 33 బాల్స్ ఆడి 68 రన్స్ చేశాడు. డుప్లెసిస్ 41 బంతుల్లో 65 పరుగులతో అదుర్స్ అనిపించాడు. చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్ 30 రన్స్ చేయడంతో భారీ స్కోర్ చేసింది.
Also Read : అబ్బా సూర్యా భాయ్ దెబ్బ