Michael Vaughan : భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు అందించిన క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ఆయనకు హిట్ మ్యాన్ అని కూడా పేరుంది. ఇప్పటి వరకు జరిగిన 14 ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ కు టైటిళ్లు తీసుకు రావడంలో ఆజట్టుకు నాయకుడిగా ఉన్న రోహిత్ శర్మ పాత్రను విస్మరించలేం.
కానీ దుబాయ్ లో జరిగిన 2021 రిచ్ లీగ్ లో ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్క్రమించింది. ఆపై పోనీలే అని సర్దుకుంది రిలయన్స్ గ్రూప్. ఆ జట్టును ఆ సంస్థే నిర్వహిస్తూ వస్తోంది.
ఆ మేనేజ్ మెంట్ వద్ద భారీ ఎత్తున కోట్లున్నాయి. కానీ ఆడే ఆటగాళ్లు మాత్రం లేకుండా పోయాడు. ఉన్నట్టుండి పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
గతంలో నిరాశ పర్చినా ఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్ట లేదు. ఏకంగా ఏడు మ్యాచ్ లు ఆడింది.
ఆ మ్యాచ్ లలో ఒక్కటంటే ఒక్కడి గెలుపొంద లేక పోయింది. త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించక పోవడంతో తాజా, మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
రోహిత్ శర్మను టార్గెట్ చేస్తున్నారు. జట్టు సభ్యులే కాదు కెప్టెన్ కూడా ఫామ్ కోల్పోయాడు. ఒక్క సందీప్ కిషన్ , తిలక్ వర్మ లు మాత్రమే రాణిస్తున్నారు.
రోహిత్ శర్మ ప్రభావం కోల్పోవడంపై ఇంగ్లండ్ మాజీ ఎప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan)నిప్పులు చెరిగాడు. ఇలాగైతే జట్టును ఎలా నడిపిస్తావంటూ ప్రశ్నించాడు.
Also Read : హమ్మయ్య ముద్దుగుమ్మ నవ్వింది