Michael Vaughan : కుల్దీప్ సేన్ కు మైఖేల్ వాన్ కితాబు
రాజస్థాన్ రాయల్స్ కు అతడు కీలకం
Michael Vaughan : ఐపీఎల్ 2022లో ఫెవరేట్ జట్లు ఇంటి బాట పట్టాయి. అనుకోని జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఇంకా రెండు ప్లేస్ లలో ఏ జట్లు చేరుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.
ఈ తరుణంలో టాప్ లో ఉన్న కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడ బోతోంది రాజస్థాన్. ప్రధానంగా ఆ జట్టుకు కెప్టెన్ సంజూ శాంసన్ పేలవమైన ప్రదర్శన ఇబ్బందిగా మారింది.
దుబాయ్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ లో అత్యుత్తమ స్కోరర్ గా నిలిచాడు తన జట్టు నుంచి. కానీ ఈసారి సీన్ మారింది. టోర్నీలో ఆరెంజ్ కప్ రేసులో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఓపెనర్ , స్టార్ హిట్టర్ , ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఉన్నాడు.
అతడి తర్వాత రాహుల్ నిలిచాడు. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టు రాణించాలంటే కెప్టెన్ తో పాటు మిగతా ఆటగాళ్లు సైతం ఆడాల్సి ఉంటుందని అభిప్రాయ పడ్డాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan).
ఐపీఎల్ లో అంతా సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గురించి చెబుతున్నారని కానీ తాను మాత్రం రాజస్థాన్ రాయల్స్ కు చెందిన కుల్దీప్ సేన్ ను పరిగణలోకి తీసుకుంటానని పేర్కొన్నాడు.
ఎందుకంటే ఫస్ట్ స్పెల్ లో కంటే ఆఖరి స్పెల్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడని కితాబు ఇచ్చాడు. వికెట్లు తీయక పోయినా పరుగులు ఎక్కువగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మామూలు విషయం కాదన్నాడు మైఖేల్ వాన్(Michael Vaughan).
Also Read : ఆసిస్ మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతి