Michael Vaughan : ఐపీఎల్ 2022లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో జోస్ బట్లర్ టాప్ లో ఉన్నాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు.
61 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 9 ఫోర్లు 5 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ప్రతి మ్యాచ్ లో మినిమం 50 పరుగులకు పైగానే చేస్తూ రాణిస్తున్నాడు. కేకేఆర్ బౌలర్లను ఊచ కోత కోశాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకానొక దశలో 150 దాకా చేస్తాడని అనుకునేలా ఆడాడు. మరో వైపు కెప్టెన్ శాంసన్ సైతం సత్తా చాటాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఇదిలా ఉండగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ (Michael Vaughan )సంచలన కామెంట్స్ చేశాడు. తమ దేశానికి చెందిన జోస్ బట్లర్ దుమ్ము రేపుతూ సత్తా చాటుతుండడాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు.
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ లో టీ20 ఫార్మాట్ లో ఎవరు అత్యుత్తమ ఆటగాడు బ్యాటర్ గా అంటే తాను మాత్రం జోస్ బట్లర్ ను పేర్కొంటానని కుండ బద్దలు కొట్టాడు మైఖేల్ వాన్.
వాట్ ఏ అటాకింగ్ అంటూ కితాబు కూడా ఇచ్చాడు. సామాన్యంగా వాన్ ఎవరినీ ప్రశంసించడు. అందరినీ ఏకి పారేయడమే. మనోడు క్రికెట్ కామెంటేటర్ కూడా.
ఇక తాజాగా కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ లీగ్ మ్యాచ్ పై స్పందించాడు. ఇదే రీతిలో బట్లర్ చెలరేగుతూ పోతే రాజస్థాన్ రాయల్స్ ను అడ్డుకోవడం ఇతర జట్లకు కష్టం అవుతుందని హెచ్చరించాడు.
Also Read : ఫించ్ మెరిసినా అయ్యర్ ఆడినా ఓటమే