Milinda Moragoda : చైనా ఫ్రెండ్ భార‌త్ బ్ర‌దర్ – శ్రీ‌లంక‌

హై క‌మిష‌న‌ర్ మిలిందా మొర‌గోడా కామెంట్స్

Milinda Moragoda : శ్రీ‌లంక హై క‌మిష‌న‌ర్ (దౌత్య‌వేత్త‌) మిలిందా మొర‌గోడా(Milinda Moragoda) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌లంక దేశానికి చైనా స్నేహితుడ‌ని అయితే భార‌త దేశం సోద‌రుడ‌ని పేర్కొన్నారు.

ఇరు దేశాలు త‌మ‌కు అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం శ్రీ‌లంక ఆర్థిక‌, రాజ‌కీయ సంక్షోభం నుంచి గ‌ట్టెక్కే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా గోట‌బ‌య రాజ‌ప‌క్సే దేశం నుంచి విడిచి వెళ్లి పోయి తిరిగి రావ‌డంతో కొంత ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

ఇక త‌మ దేశపు టూరిజానికి ప్ర‌యారిటీ ఇచ్చేందుకు గాను శ్రీ‌లంక క్రికెట్ మాజీ దిగ్గ‌జం స‌న‌త్ జ‌య‌సూర్య(Sanath Jayasuriya) ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించింది.

ఇదే స‌మ‌యంలో శ్రీ‌లంక దౌత్య‌వేత్త మిలింగా మొర‌గోడా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. చైనా, భార‌త్ దేశాల మ‌ధ్య సంబంధాన్ని ప్ర‌త్యేక‌మైన‌దిగా అభివ‌ర్ణించారు.

భార‌త దేశ భ‌ద్ర‌తా ప్ర‌యోజ‌నాలు శ్రీ‌లంక దేశ భ‌ద్ర‌తా ప్ర‌యోజ‌నాలుగా ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా క‌ష్టాల్లో ఉన్న శ్రీ‌లంక‌కు భార‌త దేశం 3.8 బిలియ‌న్ డాల‌ర్ల సాయం అందించింది.

భార‌త్ తో ద్వీప దేశం సంబంధాల గురించి మ‌హీంద రాజ‌ప‌క్సే చేసిన వ్యాఖ్య‌ల‌ను భార‌త దేశంలోని శ్రీ‌లంక హై క‌మిష‌న‌ర్ మిలిందా ప్ర‌స్తావించారు. భార‌త్, శ్రీ‌లంక క‌లిసి ఒకే కుటుంబం. ఫ్యామిలీ అన్నాక గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌న్నారు.

చివ‌ర‌కు కుటుంబం ఒక్క‌టిగా మారుతుంద‌న్నారు మిలిందా మొర‌గోడా(Milinda Moragoda). ఇండియ‌న్స్ ఉమెన్ మీట్స్ లో హై క‌మిష‌న‌ర్ మాట్లాడారు. రామాయ‌ణం నుడి నేటి బౌద్ధ మ‌తం వ‌ర‌కు చారిత్రాత్మ‌క సంబంధం ఉంద‌న్నారు.

Also Read : భార‌త రాయబారితో సుంద‌ర్ పిచాయ్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!