Minister Amit Shah : ఆ రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ కాల్
మీ మీ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి.. వారిని వెంటనే పాకిస్థాన్ పంపాలని సూచించారు...
Amit Shah : పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని కేంద్ర ప్రభుత్వం మరో కీకల నిర్ణయం తీసుకొంది. దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah).. శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన స్వయంగా ఫోన్ చేసి.. వారికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మీ మీ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి.. వారిని వెంటనే పాకిస్థాన్ పంపాలని సూచించారు.
Amit Shah Call to CM’s
మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ తగిన ఆధారాలను సేకరించింది. అందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన విదేశీ కార్యదర్శులకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందజేశారు.
మరోవైపు భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు 48 గంటల లోపు దేశం విడిచివెళ్లాలంటూ ఆదేశించింది. దీంతో ఇప్పటికే భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పాకిస్థానీయులు.. స్వదేశం వెళ్లేందుకు అటారీ సరిహద్దు వద్ద క్యూ కట్టారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాకిస్థానీయులను సైతం భారత్‌ను పంపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫొన్ చేసి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు.
Also Read : High Alert in Hyderabad : భాగ్య నగరంలో కట్టుదిట్టమైన భద్రతా బలగాలు