Minister Anam : భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నెల్లూరు కలెక్టర్ తో సమీక్షించిన మంత్రి

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నెల్లూరు కలెక్టర్ తో సమీక్షించిన మంత్రి..

Minister Anam : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో మంత్రి ఆనం(Minister Anam) చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం(Minister Anam) చెప్పుకొచ్చారు. ఆనం ఆదేశాలతో ముఖ్యంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఆర్డీవో పావని, అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Minister Anam Comment

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇవాళ(సోమవారం) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి, రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలతో నదులు, వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి హెచ్చరించారు. అలాగే విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ప్రజలు నిలుచోవద్దని చెప్పారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : KTR : కేటీఆర్ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో విచారణ

Leave A Reply

Your Email Id will not be published!