Minister Anam : తిరుమలలో మార్పులపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి ఆనం

తిరుమల ప్రసాదాల నాణ్యత పెరిగిందని భక్తులు ప్రశంసిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు...

Minister Anam : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam) అన్నారు. ఈ సందర్బంగా గురువారం మంత్రి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. తిరుమల్లో గతంలో అనేక వివాదాలు ఉండేవని.. ప్రస్తుతం ఎటువంటి వివాదాలు లేకుండా పరిపాలన సాగుతోందని అన్నారు.

Minister Anam Comments

తిరుమల ప్రసాదాల నాణ్యత పెరిగిందని భక్తులు ప్రశంసిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam) అన్నారు. ప్రతి నెలా తిరుమలకు వచ్చి భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయా లేదా అన్నది పరిశీలిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ధూప దీప నైవేథ్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామని, మఠాలు, పీఠాలు ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా వుండాలని ఆకాంక్షించారు. మఠాలు వ్యాపారాత్మక దోరణిలో ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్ట దెబ్బతిన్నదని.. కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చమన్నారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత, రుచి పెరిగిందని, భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం, ప్రసాదాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. భక్తులు తమ అభిప్రాయాలను ఫిర్యాదుల పుస్తకంలో ప్రస్తావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం తిరుమలలో ఫిర్యాదుల పుస్తకం కూడా కనిపించకుండా చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు తాము భక్తులందరికీ ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచామన్నారు. భక్తుల సూచనలు సలహాలను స్వీకరిస్తున్నామని.. తిరుమల ఖ్యాతిని పెంచి భక్తులందరికి సంతృప్తికర సేవలు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు తిరుమలలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల శ్రీవారికి నైవేధ్య సమర్పణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు.

Also Read : DY CM Udhayanidhi : తమిళనాడు లో ఆ పార్టీపై భగ్గుమన్న డిప్యూటీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!