Minister Atchannaidu-Budget 2025-26 : వ్యవసాయ బడ్జెట్ లో కీలక అంశాలు

గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని..

Minister Atchannaidu : ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని అన్నారు. వికసిత్‌ భారత్‌కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Minister Atchannaidu Comment

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయినికి 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రోత్‌ ఇంజిన్లుగా 11 పంటలని.. ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు కేటియించినట్లు చెప్పారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహానికి రూ.61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు కేటాయించామని, 875 కిసాన్‌ డ్రోన్‌ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Also Read : Union Tax Revenue : కేంద్ర సర్కార్ ఇచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు కోత విధించనుందా?

Leave A Reply

Your Email Id will not be published!