Minister Atchannaidu : మంత్రి లోకేష్ పై అచ్చన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా..మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి...

Atchannaidu : ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా లోకేష్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్‌(Nara Lokesh)కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారని విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను వైసీపీ నేతలు తీవ్రంగా వేధించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Minister Atchannaidu Comments

ఈ సమయంలో యువగళం పాదయాత్ర చేసి పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోకేష్ ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. కూటమికి 164 స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారని ఉద్ఘాటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీకి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ‘‘ఎవరు వద్దన్నా, కాదన్నా… టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు లోకేష్. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఈ విషయాన్నే చెబుతాడు… ఇందులో ఏ వివాదం లేదు. ఏ నిర్ణయాలు అయినా కూటమి పెద్దల నిర్ణయం తర్వాతే అమలు చేస్తాం. ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి విధానం కాదు…ఇదీ అందరూ పాటిస్తున్నాం’’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

కాగా..మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేష్‌కు పుట్టిన రోజు వేడుకలను వాడవాడలా జరుపుతున్నారు. ఏపీ వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆయా నియోజకవర్గాల్లో కేక్‌ కటింగ్‌ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరిపారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించారు.

Also Read : Venkatesh Iyer : రంజీ ట్రోఫీలో గాయపడ్డ భారత అల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్

Leave A Reply

Your Email Id will not be published!