Minister Atchannaidu : జగన్ సర్కార్ పై భగ్గుమన్న మంత్రి అచ్చెన్నాయుడు

అన్నిహమీలు నెరవేర్చే.. మరల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కి వెళతామని స్పష్టం చేశారు...

Atchannaidu : ముమ్మిడివరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్యకారులకు ఓన్‌జీసీ సంస్థ శ్రీకారం చుడితే తానే చేశానని మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రగల్భాలు పలికారని మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఐదు సంవత్సరాలలో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేశారని.. అతను చేసిన అప్పులకు రూ.22 వేల కోట్లు వడ్డీ కడుతున్నామని.. మొత్తం రాష్ట్రాన్ని దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 లో తాము వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలీటర్‌పై ఉందన్నారు. ఆరు మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రనికి ఆక్సిజన్ అందిందన్నారు. వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను మాయ చేద్దామని చూశారని.. తాము వచ్చిన వెంటనే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు.

Minister Atchannaidu Comment

అన్నిహమీలు నెరవేర్చే.. మరల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కి వెళతామని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపద ఉద్యోగుల జీతాలకు సరిపోవడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.8,400 కోట్లు తల్లికి వందనం ఇస్తామన్నారు. మత్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 2014లో టీడీపీ మత్యకారులను అన్ని విధాలుగా ఆదుకుందని.. మరలా మత్స్యకారుల జీవనోపాధి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో జట్టీలను అభివృద్ధి చేసి మత్యకారుల వలసలు అరికడతామన్నారు. ఏప్రిల్ 1కి వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు రూ.20 వేలు ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఆరు నెలల్లో లక్ష 80 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయని.. 20 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు. జగన్‌ అనే దెయ్యాని మరలా రాష్ట్రం వైపు చూడకుండా చూస్తాం..దానికి ప్రజలు సహకరించాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చి నష్ట పోయిన వ్యక్తి ఎమ్మెల్యే బుచ్చిబాబు అని.. అభివృదే లక్ష్యంగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) పేర్కొన్నారు.

Also Read : AP Govt : ఇన్ఫోసిస్ సహాయంతో క్యాపిటల్ సిటీ లో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’

Leave A Reply

Your Email Id will not be published!