Minister Atchannaidu : ముంపు ప్రాంతాల్లో పశువులకు వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

కాగా.. భారీ వర్షాలకు వెలగలేరు జగనన్న లే అవుట్ బుడమేరు వరదలో పూర్తిగా మునిగిపోయింది...

Minister Atchannaidu : వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో పశువులకు వైద్యం అందించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించనున్నారు. విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో బోట్లతో మత్స్యకారులు సేవలు చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను వ్యవసాయ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఆదేశాలు జారీ చేశారు.

Minister Atchannaidu Order..

కాగా.. భారీ వర్షాలకు వెలగలేరు జగనన్న లే అవుట్ బుడమేరు వరదలో పూర్తిగా మునిగిపోయింది. ఇంకా ముంపులోనే హెచ్.ముత్యాలంపాడు గ్రామం ఉంది. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆహార పంపిణీ ఎంత మేరకు చేశారో డివిజన్ల వారీగా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Also Read : Delhi Excise Policy Case : ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు ‘విజయ్ నాయర్’ కు బెయిల్ మంజూరు

Leave A Reply

Your Email Id will not be published!