Minister Atchannaidu : నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ఎవ్వరూ భయపడొద్దు
విత్తన పంపణీపై తక్షణ అమలుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు...
Minister Atchannaidu : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం నాడు ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) మాట్లాడారు. పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ చేశామని తెలిపారు.
Minister Atchannaidu Comment
విత్తన పంపణీపై తక్షణ అమలుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అధిక వర్షపాతం నమోదు కావడంతో వరి పంటలు పాడయ్యాయని చెప్పారు. ఇప్పటికే వరి ఊడ్పుల కోసం సిద్ధంగా ఉన్న సుమారు 1406 హెక్టార్ల నారుమళ్లు, 33వేల హెక్టార్లలో నాట్లు పూర్తయిన వరి పంట ముంపునకు గురైందని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సుమారు 6356 క్వింటాళ్ల వరి విత్తనాలను తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో గల ప్రతి రైతు సేవా కేంద్రాల వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయటానికి సిద్ధం చేశామని అన్నారు. అధిక వర్షాలతో నారుమళ్లు, నాటిన వరి పంటలు దెబ్బ తిన్న రైతులు 80% రాయితీపై తమ తమ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా తీసుకోవచ్చని వెల్లడించారు. మంచి సాగు యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని అచ్చెన్నా యుడు కోరారు.
Also Read : Congress : రాహుల్ ను అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరిన కాంగ్రెస్ సీనియర్ నేత