Minister Bandi Sanjay : రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం అన్ని విధాలా సహాయం..
Bandi Sanjay : రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం, ఏసీ ఫంక్షన్ హాల్, వాణిజ్య భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఎరువులపై రూ.30 వేల కోట్ల రాయితీ అందించిదని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా వారి ఖాతాల్లో రూ.6 వేల చొ ప్పున జమ చేస్తోందని చెప్పారు.
రైతులు యూ రియా బస్తాల కోసం చెప్పులు లైన్‌లో పెట్టి ఎదురుచూసే పనిలేకుండా కేంద్ర ప్రభుత్వం రామగుండంలో ఎరువుల పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఏ పార్టీ అయినా ఓట్లు వేసింది ప్రజలేనని, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తామని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా అందరం కలిసే ఉంటామని, కొట్లాడుకునే జమానా పోయిందన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు రాక మాజీ సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభు త్వం బిల్లులను విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
Minister Bandi Sanjay Comments
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ నెల 24న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. దేశంలోనే తొలిసారిగా 4 వేల ఇళ్లకు నిరంతరం తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ పథకం కరీంనగర్ హౌసింగ్ బోర్డు ప్రాంతవాసులకు అందుబాటులోకి రానుంది. ఇంత పెద్దసంఖ్యలో నివాసాలకు 24 గంటలపాటు నిరంతరం తాగునీరు అందించే సౌకర్యం దేశంలో ఎక్కడా లేదు.
Also Read : Chhattisgarh Encounter : కాలారి ఘాట్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత చలపతి దుర్మరణం