Minister Hebbalkar : ఎమ్మెల్సీ సీటీ రవి కి సవాల్ విసిరిన మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్
లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను చూసి రాజకీయాల్లోకి రావాలని మహిళలు అనుకోవాలన్నారు...
Minister Hebbalkar : పరిషత్‌లో తనపట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదని వాదిస్తున్న ఎమ్మెల్సీ సీటీ రవికి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సవాల్ విసిరారు. ధర్మస్థళలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. బెళగావిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహాభారతం, రామాయణ కాలం నుంచి మహిళను అవమానించేవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సీటీ రవి వ్యాఖ్యలకు సాక్ష్యాలు ఉన్నాయని లేదంటే అలాంటి మాటలు తనపై తానే చేసుకునేందుకు పిచ్చిదాన్నా అన్నారు. రాజకీయంగా తాను పొందేది ఏమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. సీటీ రవి ఫ్రస్ట్రేషన్ పదం వాడానని చెబుతున్నారని, ఆ పదానికి ఎంత తేడా లేదా అన్నారు. లక్ష్మీ హెబ్బాళ్కర్(Minister Hebbalkar)ను చూసి రాజకీయాల్లోకి రావాలని మహిళలు అనుకోవాలన్నారు. కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు తానెందుకు పడాలన్నారు.
Minister Hebbalkar Challenge
మంత్రిలక్ష్మీ హెబ్బాళ్కర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ సీటీ రవి వ్యాఖ్యల దుమారంపై పోరాటానికి సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రకు వ్యతిరేక కూటమి నేత బసనగౌడపాటిల్ యత్నాళ్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో బీజేపీలో ఈ వివాదంపై కలసి పోరాటం చేయనున్నారు. ఏ విధంగా నిరసన చేపట్టాలనే విషయమై రాష్ట్ర కోర్ కమిటీతో చర్చించాక విజయేంద్ర, పార్టీ జాతీయ నేతలను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు. విధానపరిషత్ సమావేశాల వేళ మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Hebbalkar), బీజేపీ సభ్యుడు సీటీ రవిల మధ్య చోటు చేసుకున్న వివాదం రాజభవన్‌కు చేరింది. గవర్నర్ థావర్‌చంద్ గ్లెహాట్ ఆదేశాలకు అనుగుణంగా పరిషత్ సభాపతి బసవరాజహొరట్టి వివరణ ఇచ్చారు.తొలుత రాజభవన్ అధికారులు పరిషత్‌లో చోటు చేసుకున్న సంఘటన వివరాలను సభాపతిని కోరారు. ఆతర్వాత సభాపతి హొరట్టి నేరుగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసి రాజభవన్ నుంచి వివరణ కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం సభాపతి నేరుగా రాజభవన్‌కు వివరణ ఇచ్చారు.
బెళగావి సువర్ణసౌధలో ఈనెల 9 నుంచి 19వరకూ శాసనసభ శీతాకాల సమావేశాలు జరిగాయని చివరి రోజు గురువారం ప్రశ్నోత్తరాల వేళ చోటుచేసుకున్న గందరగోళంతో సభను కాసేపు వాయిదా వేశామని వివరిస్తూనే ఇప్పటికే తెలిపిన సమగ్ర సమాచారాన్ని రాజభవన్‌కు వివరించారు. ఇద్దరూ తనకు ఫిర్యాదు చేశారన్నారు. రికార్డుల పరంగా ఎక్కడా అటువంటి పదాలు లేవన్నారు. కానీ మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్ ఆడియోలు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించినట్లు వివరించారు. ఆత్మసాక్షికి అనుగుణంగా వదిలిపెట్టి సభను వాయిదా వేశానని వివరణ ఇచ్చారు.
Also Read : Renuka Swamy Case : రేణుకా స్వామి కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్