Minister Jupally : తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దే..

కాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు...

Minister Jupally: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులదేనని పదేళ్లు పాలన చేసి ప్రజాస్వామ్యాన్ని పాతర వేసి 10 నెలల ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన నాగర్ కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందన్నారు. రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని మంత్రి జూపల్లి తెలిపారు.

Minister Jupally Krishna Rao Comment

రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఈ రోజు తాము ఏ పని చేయాల్సి వచ్చేది కాదని అన్నారు. నాగార్జున సాగర్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగా సాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే, నాగార్జున సాగర్‌, బుద్ధవనంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్టార్‌ హోటళ్లు నిర్మిస్తామని వెల్లడించారు.

కాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతోపాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ సీఎం రేవంత్‌ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు స్పందించిన హరీశ్‌ రావు… సీఎం పేర్కొన్న అంశాలను తప్పుబడుతూ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలనే కాక దేశాన్నే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,61,000 పోస్టులు భర్తీ చేసిందన్నారు. కానీ ఈ నియామకాలపై సీఎం తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని హరీశ్‌ వాపోయారు. ఎన్నికల కోడ్‌ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను ఇచ్చి ఆయా నియామకాలు తామే చేసినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.

Also Read : Minister Ram Mohan : సీఎం శ్రీకాకుళం పర్యటనపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి రామ్ మోహన్ నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!