Minister Jupally : రాజకీయ లబ్దికోసం కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
రూ.21వేల కోట్లు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు...
Minister Jupally : మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా రేసు కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫార్ములా రేసు కేసును కేటీఆర్ ఫేస్ చేయాలన్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, హాజరు కావాలని చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిందని విమర్శించారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుందని ఆక్షేపించారు.బాన్సువాడలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ(మంగళవారం) పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని తెలిపారు.
Minister Jupally Slams KTR
రూ.21వేల కోట్లు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ తమ ప్రభుత్వం గురించి మాట్లాడితే ఆధారాలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలిగిందని అన్నారు. పెరిగిన ఆదాయం పేదవాళ్లకు పంచిపెట్టాలనే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్టానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్ఘాటించారు.
Also Read : Shubman Gill : శుబ్ మన్ గిల్ ప్రేమాయణం పై వస్తున్న రూమర్లపై స్పందించిన నటి రిథిమా