Minister Kishan Reddy : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే

GHMC భవనంపై బీజేపీ జెండాను ఎగరేయాలని పార్టీ నేతలు..

Kishan Reddy : బల్దియా బాద్‌షాగా బీజేపీ నిలవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. GHMC మేయర్‌ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవాలని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని కిషన్‌ రెడ్డి అన్నారు. మజ్లిస్‌ అహంకారంతో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ కోరలు పీకాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. GHMC భవనంపై బీజేపీ జెండాను ఎగరేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కిషన్‌ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలనను చూశామని, ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనలో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆరోపించారు.

Minister Kishan Reddy Comments

హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకెల దీపక్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

Also Read : తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన అప్డేట్..4 నిందితుల అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!