Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లే తనకు గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని ఆయన స్పష్టం చేశారు. దేశం పట్ల భక్తితో, జెండా పట్ల గౌరవంతో బీజేపీలో సాధారణ కార్యకర్తగా చేరి, ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న తాను తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తిగా రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఆయన దిగజారుడు తత్వానికి ఉదాహరణ అని మండిపడ్డారు.
Minister Kishan Reddy Slams
రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే, తాను ఎప్పుడూ ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పదవుల కోసం పార్టీలు మారి కాళ్లు పట్టుకొనే వాడిని తాను కాదని తేల్చిచెప్పారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంరేవంత్ చేతిలో ఉన్నప్పుడు, ఆయన ఎలాంటి విచారణ చేస్తారో చేసి, తమకు అప్పగించాలని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read : Vivek Ramaswamy : ఒహియో గవర్నర్ పదవికి మద్దతు పలికిన ప్రెసిడెంట్ ట్రంప్, మస్క్