Minister Kishan Reddy : భారత్ ను విశ్వగురువుగా నిలబెట్టడమే ప్రధాని మోదీ లక్ష్యం

ఈ నెల 26 నుంచి 2026 జనవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు...

Kishan Reddy : భారత్‌ను విశ్వగురువుగా నిలపడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని.. రాజ్యాంగం విలువలను, అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజలకు తెలియజేసేందుకే ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ కార్యక్రమం అన్నారు. ఈ నెల 26 నుంచి 2026 జనవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Minister Kishan Reddy Comment

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరణ చేశారని, కోర్టు తీర్పులను సైతం వ్యతిరేకించారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్‌ ఇప్పుడు నీతులు చెబుతుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గౌతమ్‌రావు, బంగారు శృతి, కొల్లి మాధవి, జి.ఆనంద్‌గౌడ్‌, శ్యాంసుందర్‌గౌడ్‌, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : KTR Slams : ఢిల్లీలో బీజేపీ గెలుపుకోసమే కాంగ్రెస్ ఈ కుట్ర

Leave A Reply

Your Email Id will not be published!