Minister Kollu Ravindra : పేర్ని నాని బియ్యం కుంభకోణంపై భగ్గుమన్న మంత్రి కొల్లు రవీంద్ర

కాగా..మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్, పౌరసరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది...

Kollu Ravindra : పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన ఏ ఒక్కర్నీ వదలబోమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) హెచ్చరించారు. మంగళారం మీడియాతో మాట్లాడుతూ.. నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రూ.90 లక్షల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని వైసీపీ మాఫియా బొక్కేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ… వాళ్ల నాయకుడో గజదొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు బందరు యువతను గంజాయి మత్తులో నెట్టారన్నారు. అవినీతి కోసం ఇంట్లో మహిళల్ని కూడా రోడ్డుకీడ్చడం దుర్మార్గమన్నారు. బియ్యం కుంభకోణంలో పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యాడని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

Minister Kollu Ravindra Comments

కాగా..మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్, పౌరసరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది. వారం రోజులుగా అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ ఉంది. వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. నిన్న (సోమవారం) సాయంత్రం అజ్ఞాతం నుంచి పేర్ని నాని బయటకొచ్చారు. ఇంకా పేర్ని నాని సతీమణి జయసుధ అజ్ఞాతం వీడలేదు. గోడౌన్లు ఆమె పేరుతో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకున్న పేర్ని నాని అవినీతి కారణంగా ఆయన భార్య జయసుధకు తిప్పలు తప్పడం లేదు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని పిటీషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు అజ్ఞాతంలోనే భార్యను పేర్ని నాని ఉంచారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ.. వారి ఆచూకీ కొనుగొనడంలో కృష్ణా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కొంతమంది అధికారులు, టీడీపీ నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Also Read : One Nation One Election Bill : జమిలి ఎన్నికల బిల్లుకు అనుకూలంగా లోక్ సభలో 269 అనుకూల ఓట్లు

Leave A Reply

Your Email Id will not be published!