Minister Kollu Ravindra : మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగిన మంత్రి కొల్లు రవీంద్ర

అయితే గత పదిరోజులుగా జయసుధ అజ్ఞాతంలో ఉండటంతో ఆమెకు పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు...

Kollu Ravindra : వైఎస్సార్పీనేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పేదల బియ్యాన్ని పేర్ని నాని బొక్కేశారంటూ వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో నాని అడ్రస్ లేకుండా పారిపోయారన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్ప లేదంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే అని అన్నారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో ఐదు వేల బస్తాల రేషన్ బియ్యం మాయం చేసి.. కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు. కేసు విచారణకు సహకరించకుండా పేర్ని నాని, అతని కుటుంబం మచిలీపట్నం నుంచి పరారైపోయిందన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్‌తో హైకోర్టులో క్వాష్ పిటీషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని.. పేర్ని నాని అవినీతి మొత్తాన్ని బట్టబయలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) స్పష్టం చేశారు.

Minister Kollu Ravindra Comments

కాగా..కృష్ణా జిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గత పదిరోజులుగా జయసుధ అజ్ఞాతంలో ఉండటంతో ఆమెకు పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పేర్నినాని సతీమణి కోసం కృష్ణా జిల్లా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పేర్నినాని కుటుంబానికి నోటీసులపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయంపై లోతైన విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పేర్నినాని కుటుంబానికి నోటీసులు అందించామని.. ఆ నోటీసులు ఆయన చూడకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా.. రేషన్ బియ్యం మాయం కేసులో నిన్న పేర్నినాని ఇంటి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసును అంటించారు పోలీసులు.

Also Read : Parawada Pharma Incident : మరోసారి పరవాడ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!