Minister Komatireddy : తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ మూలం
ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ కాంగ్రెస్ ఓట మి పాలవ్వడంపై..
Minister Komatireddy : తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కారణం బీఆర్‌ఎస్ పార్టీనేని.. ముమ్మాటికీ ఆ ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు అందించినందుకు అభినందనలు అంటూ బీఆర్‌ఎ్‌సకు చురకలు అంటించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ కాంగ్రెస్ ఓట మి పాలవ్వడంపై రాహుల్‌గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు.
Minister Komatireddy Comments…
ఈ సందర్భంగా.. ‘‘మేం కాంగ్రెస్ పార్టీ యోధులం. తెలంగాణలో ఓటమి తరువాత ఎలాగైతే తిరిగి పుంజుకుని విజయం సాధించామో.. అలాగే దేశ వ్యాప్తంగా గెలుస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం మీ సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం మీది, మీ పార్టీది.’’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.
Also Read : Minister Ponnam Prabhakar : నెక్లెస్ రోడ్డులో ఆర్థోపెడిక్ వాక్ థాన్ ను ప్రారంభించిన మంత్రి