Minister Komatireddy : రైతు భరోసాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి

అలాగే..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా దివస్‌పై మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

Minister Komatireddy : రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ సమీపంలోని రాంరెడ్డి గార్డెన్‌లో ఈరోజు (శుక్రవారం) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… సంక్రాంతికి ఎకరాకు 7 వేల చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) వెల్లడించారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకి ఇవ్వలేదని విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామని తెలిపారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బీటీ రోడ్ వేస్తామని.. మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే బావ బామ్మర్ది ప్రజా ప్రభుత్వం పడిపోతుందని విమర్శిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Minister Komatireddy Comments

అలాగే..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా దివస్‌పై మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇందాక ఎక్కడోకాయన కేసీఆర్ బొమ్మ పెట్టి దీక్షా దివస్ అని పోస్టర్ చుసిన.. బీఆర్ఎస్ నేతల హడావిడి చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. అయన గ్లూకోజులు, విటమిన్స్ తీసుకుంటూ చేసిన దీక్షకు కూడా ఇంత బిల్డప్ ఇస్తారా? కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోనె ప్రకాష్ రావుని అడిగితే కుల్ల కుల్ల చెప్తడు’’ అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ది నకిలీ దీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. బూస్ట్ తాగుతూ, సెలైన్లు, విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. కానిస్టేబుల్ కిష్టయ్యది, శ్రీకాంతాచారి ది నిజమైన త్యాగమన్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతో జరిగిందన్నారు. ‘‘నేను నల్గొండ చౌరాస్తలో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. కేసీఆర్ లాగా ఎప్పుడు ప్రచారం చేసుకోలే. మూడేండ్లు మంత్రి పదవి ఉండగా నేను రాజీనామ చేశాను’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

అలాగే కేసీఆర్(KCR) దీక్షపై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేసింది ఫేక్ దీక్ష అని.. దీక్ష సమయంలో జ్యూస్లు, మెడిసన్లు తీసుకున్నారన్నారు. రాష్ట్ర ఇంటలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని తెలిపారు. కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారని అప్పుడే మీడియాకి తెలిపానని.. హరీష్ రావు చస్తా అని బెదిరించి పెట్రోల్ పెట్టుకున్నారు కానీ అగ్గిపెట్టే లేదన్నారు. కేసీఆర్ ఉద్యమ కారులను రెచ్చిగొట్టి 1200 ప్రాణాలు తీశారని ఆరోపించారు. ‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కేసీఆర్ దొంగ దీక్ష దివాస్‌పై కమిటీ వేసి దర్యాప్తు జరపాలి’’ అని డిమాండ్ చేశారు. మొదటి అసెంబ్లీ లో 1200 మంది చనిపోయారని చెప్పారని.. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల నుంచి దీక్ష దివాస్ పేరుట బీఆర్‌ఎస్ హడావుడి చేస్తోందన్నారు. తెలంగాణ జాగృతి పేరిట కవిత ఈరోజు రంగ ప్రవేశం చేస్తున్నారన్నారు. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెడతామని గతంలో జైపాల్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా గోనె ప్రకాష్ రావు గుర్తుచేశారు.

Also Read : Minister Kollu Ravindra : విజన్ ఉన్న నాయకుడు బాబు రావడంతో ఏపీలో రూపురేఖలు మారుతున్నాయి

Leave A Reply

Your Email Id will not be published!